డూప్‌ కేసీఆర్‌... కార్యకర్తల్లో హుషార్‌

డూప్‌ కేసీఆర్‌... కార్యకర్తల్లో హుషార్‌
x
Highlights

కేసీఆర్ ఇప్పుడెక్కడున్నారు....క్యాంప్‌ ఆఫీస్ లేదంటే ఫాంహౌజ్...కానీ మంచిర్యాల శ్రీరాంపూర్‌ సంతలో, కూరగాయలు తూకం వేస్తున్నారు. బజ్జీల బండి దగ్గర అందర్నీ...

కేసీఆర్ ఇప్పుడెక్కడున్నారు....క్యాంప్‌ ఆఫీస్ లేదంటే ఫాంహౌజ్...కానీ మంచిర్యాల శ్రీరాంపూర్‌ సంతలో, కూరగాయలు తూకం వేస్తున్నారు. బజ్జీల బండి దగ్గర అందర్నీ పలకరిస్తున్నారు. సెక్యూరిటీని కాదని, దారినపోయే ప్రతి ఒక్కరికీ షేక్ హ్యాండ్‌ ఇస్తున్నారు. సంతలో మొత్తం కలయ తిరుగుతున్నారు. డూప్‌ కేసీఆరే. మంచిర్యాల టీఆర్ఎస్‌ అభ్యర్థి కోసం, గులాబీ బాస్‌లా మేకప్‌ వేసుకుని, ప్రచారం చేస్తున్నాడు. కేసీఆర్‌లా ఉండటమే కాదు, పంచ్‌లు కూడా బాగానే విసురుతున్నాడు... అచ్చం కేసీఆర్ పోలికలు....అవే హావభావాలతో సందడి చేస్తున్న ఇతని పేరు రాజా రమేష్. హైదరాబాద్‌లో మేకప్‌మెన్. 2009 నుంచి టిఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ సంతలో క్యాంపెయిన్‌ చేశాడు. దూరం నుంచి చూసిన జనం కూడా, సేమ్‌ కేసీఆర్‌లా ఉండటంతో తొలుత షాక్‌ అయ్యారు. కేసీఆర్‌ ఏంటీ....మనమధ్యకు రావడమేంటని షాక్‌ అయ్యారు. దగ్గరకు వచ్చేకొద్దీ అసలు రూపమెవరిదో తెలిసి, నవ్వుకున్నారు. అదీ కేసీఆర్ డూప్‌ కథ.

Show Full Article
Print Article
Next Story
More Stories