ప్రణయ్ విగ్రహానికి బ్రేక్.. కారణం ఏంటంటే..

ప్రణయ్ విగ్రహానికి బ్రేక్.. కారణం ఏంటంటే..
x
Highlights

ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశయమైన సంగతి తెలిసిందే. కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కారణంగా ఆమె...

ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశయమైన సంగతి తెలిసిందే. కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కారణంగా ఆమె తండ్రి ప్రణయ్ ను దారుణంగా చంపించాడు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులు జైల్లో ఉన్నారు. ఇదిలావుంటే ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ భార్య అమృత కోరుతుండగా .. అతడి విగ్రహాన్ని మిర్యాలగూడలోని సాగర్‌ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా చిన్న వెంకటరమణారావు అనే వ్యక్తి హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. అనుమతి లేకుండా విగ్రహ నిర్మాణం జరుగుతుందని.. విగ్రహ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. దాంతో పిటిషనర్ తరుపు వాదనలు విన్న కోర్టు.. ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అన్ని శాఖల అధికారుల అనుమతులు తీసుకోవాలని, అప్పటి వరకు ఎలాంటి పనులను చేపట్టరాదని హైకోర్టు జస్టిస్‌ ఏవీ. శేషసాయి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటులో కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, టూటౌన్‌ సీఐ, మున్సిపల్‌ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. అలాగే ప్రణయ్‌ తండ్రికి నోటీస్‌లు ఇవ్వాలని కోర్టు సూచించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణ నిమిత్తం వచ్చే నెల 23వ తేదీన అధికారులను కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories