టీటీడీ ఛైర్మెన్‌గా రాఘవేంద్రరావు..?

x
Highlights

టీటీడీ ఛైర్మెన్ గా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీటీడీ బోర్డు ఏర్పాటు చేసి.....

టీటీడీ ఛైర్మెన్ గా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీటీడీ బోర్డు ఏర్పాటు చేసి.. రాఘవేంద్రరావును ఛైర్మెన్ గా నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. యేడాది కాలంగా రాఘవేంద్రరావును ఛైర్మెన్ గా నియమిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో.. త్వరలోనే తీపి కబురు అందుతుందని చెబుతున్నారు. ఇంతకుముందు బోర్డులో రెండు పర్యాయాలు సభ్యుడిగా కొనసాగిన రాఘవేంద్రరావు కోసం.. టీటీడీ చట్టంలో సవరణలు చేయనున్నారు.

మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విష‍యంలో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మద్దతుగా నిలుస్తుందని.. రాఘవేంద్రరావు తెలిపారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. హోదా కోసం.. తన గడ్డాన్ని సమర్పించినట్లు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories