వెబ్ సైట్ నిర్వహికులకు గూగుల్ హెచ్చరిక

వెబ్ సైట్ నిర్వహికులకు గూగుల్ హెచ్చరిక
x
Highlights

వెబ్ సైట్ నిర్వాహకులకి గూగుల్ షాక్ ఇవ్వనుందా..? వెబ్ సైట్లపై తన నియంతృత్వం పోకడలను గూగుల్ ప్రదర్శిస్తుందా..? 60శాతం డిజిటల్ యాడ్స్ ను తన ఆధీనంలోకి...

వెబ్ సైట్ నిర్వాహకులకి గూగుల్ షాక్ ఇవ్వనుందా..? వెబ్ సైట్లపై తన నియంతృత్వం పోకడలను గూగుల్ ప్రదర్శిస్తుందా..? 60శాతం డిజిటల్ యాడ్స్ ను తన ఆధీనంలోకి తెచ్చుకున్న గూగుల్ మిగిలిన 40శాతాన్ని కూడా లాగేసుకునేందుకు ప్రయత్నిస్తుందా..? అంటే అవుననే అంటున్నారు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా.
తమకున్న వనరుల్ని ఉపయోగించుకుంటున్న వెబ్ సైట్ నిర్వహాకులపై గూగుల్ కొరడా ఝుళిపించనుంది. 2018, ఫిబ్రవరి నుంచి గూగుల్ కొత్త యాడ్స్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో వెబ్ సైట్లపై ఆధారపడే వారికి ఓ విధంగా కష్టకాలమనే చెప్పుకోవాలి. గూగుల్ కు ఆమోదయోగ్యమైన కంటెంట్ ను పాఠకులకు అందిస్తున్నా డిజిటల్ యాడ్స్ మాత్రం విదేశాలతో పోలిస్తే మనదేశంలో చాలా తక్కువ. 60 శాతం యాడ్స్ గూగుల్ తన అధీనంలోనే ఉంచుకొని ప్రకటనలపై ఆంక్షలు విధిస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇంటర్నెట్ లిమిటెడ్ సీఈఓ గౌతమ్ సిన్హా వ్యాఖ్యానించారు.
గూగుల్ క్రోమ్ ను వినియోగించే వారి సంఖ్య 50శాతం ఉంటే దాని 100శాతానికి పెంచేలా యాడ్స్ పై గూగుల్ ఆంక్షను విధించనుంది. వెబ్ సైట్లు చూసే వీక్షకులు 50శాతం మంది తమ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ క్రోమ్ ను డౌన్ లోడ్ చేసుకొని వీక్షిస్తున్నారు. అయినా కక్షసాధింపు చర్యగా యాడ్స్ పై మరిన్ని నిబంధనలు తెచ్చి...క్రోమ్ ను ఉపయోగించడమే లక్ష్యంగా డిజిటల్ యాడ్స్ లో మార్పులు చేస్తుంది. ఈ మార్పుల వల్ల వెబ్ సైట్ నిర్వాహకులు పెద్ద సంస్థలు బాగున్నా చిన్న చిన్న సంస్థలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గూగుల్ యాడ్స్ పై నిబంధనల్ని సడలించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories