డిజిటల్‌ హంగులు... నేతలకు గులాబీ ముల్లు

డిజిటల్‌ హంగులు... నేతలకు గులాబీ ముల్లు
x
Highlights

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్‌కి, సోషల్ మీడియా, ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పలువురు అభ్యరులపై సోషల్ మీడీయా వేదికగా జరుగుతున్న ప్రచారం...

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్‌కి, సోషల్ మీడియా, ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పలువురు అభ్యరులపై సోషల్ మీడీయా వేదికగా జరుగుతున్న ప్రచారం పార్టీకి, తలనొప్పినగా మారింది. దీంతో ఆ నేతలకు తలంటిన పార్టీ అధినేత, అదే సోషల్ మీడియా ద్వారా విపక్షాలు చేస్తున్న రాద్దాంతాన్ని తిప్పికొట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఇక ప్రజా ఆశీర్వాద సభలకూ, డిజిటల్ హంగులు అద్దుతున్నారు కేసీఆర్. ప్రచారంలో భాగంగా నేతలు నియోజకవర్గాల్లో చుట్టేస్తున్నారు. ఇటీవల కొత్తగూడెంలోతాజా మాజీ ఎమ్మెల్యే జలగం వెంక్రాట్రావ్ వినాయక మండపాన్ని సందర్శించారు. ఆ సందర్భంలో అక్కడి మహిళలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ఈక్రమంలో ఆయన వారిపై చిరాకు పడటం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.

అలాగే స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన మాటలు, విస్త్త్రృతంగ వాట్సప్ గ్రూపుల్లో వైరల్‌గా మారి పార్టీ అధినేత దృష్టికి వెల్లాయి. మరోవైపు మాజీ డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి, ఇలాంటి అనుభవమే ఎదురైంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ప్రజలు నిలదీశారు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఆమె వెనుదిరిగిందంటూ, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక వీరేకాదు పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పార్టీ వ్యతిరేక ప్రచారం, ఎన్నికల ముందు ఇబ్బందిగా మారుతుందని పార్టీ భావిస్తోంది. ఓ వైపు నేతలు ప్రచారం చేస్తూనే, ప్రజలు ప్రశ్నించినా సంయమనం పాటించాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి.

టీఆర్ఎస్ వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా జరుగున్న ప్రచారం అంతా, కాంగ్రెస్ చేయిస్తోందని గులాబీ నేతలు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటే, తాము సోషల్ మీడీయా టీంను పటిష్టం చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న 150 మందితో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ప్రచార బాధ్యతలను ఎంపీ కవితకు అప్పగించింది పార్టీ. ఇక నుంచి ప్రతిపక్షాల ప్రచారానికి కౌంటర్ పోస్టులు చేస్తూనే, ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు విస్త్తృతంగా తీసుకెళ్లాలని వారికి హితబోధ చేశారు.

ఇక సోషల్ మీడియాను విస్త్రృతంగా ఉపయోగించుకుంటూనే, పార్టీ ప్రచారంలో సాంకేతికను జోడించాలని నిర్ణయించారు. వినాయక నిమజ్జనం తరువాత, గులాబీ బాస్ కేసీఆర్, ప్రచారాన్ని ఉదృతం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే 50 రోజుల్లో 100 నియోజక వర్గాల్లో సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ ప్రచారాన్ని ఆయా నియోజకవర్గాలకే, పరిమితం చేయకుండా సభకు హాజరుకాని వారు కూడా కేసీఆర్ ప్రసంగాన్ని తిలకించేలా గ్రామాలు, పట్టణాల్లో డిజిటల్ తెరల ద్వారా ప్రసారం చేయనున్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అటు సోషల్ మీడియా ఇటు బహిరంగ సభల ద్వారా ప్రచారాన్ని హోరెత్తించాలని భావిస్తున్న గులాబీ దళం, సాంకేతికను విస్త్త్తృతంగా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories