రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్న పథకానికి సీఎం శ్రీకారం

రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్న పథకానికి సీఎం శ్రీకారం
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నిన్న తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న డిజిటల్‌ డోర్‌ నంబర్ల కేటాయింపునకు ఆయన శ్రీకారం...

ఏపీ సీఎం చంద్రబాబు నిన్న తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న డిజిటల్‌ డోర్‌ నంబర్ల కేటాయింపునకు ఆయన శ్రీకారం చుట్టారు. ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. డిజిటల్ డోర్ నంబర్ల వ్యవస్థతో ఎన్నో ప్రయోజనాలున్నాయని అన్నారు. దీని ద్వారా ప్రభుత్వ సేవలు ఏ సమయానికి అందుతున్నాయో తెలుసుకోవచ్చన్నారు. ప్రభుత్వ సేవలన్నీ సరైన సమయం ప్రకారం ప్రజలకు అందించేందుకే డిజిటల్ డోర్ నంబర్ల వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇదిలావుంటే అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పరిశుభ్ర వాతావరణానికి ప్రతి ఒక్కరూ శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories