తొలి రోజే ‘ధడక్’ సరికొత్త రికార్డు

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ధడక్ చిత్రం నిన్న...
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ధడక్ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. జాన్వీ అద్భుతంగా నటించిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ధడక్ చిత్రం సంచలనాలు మొదలుపెట్టింది. విడుదలైన రోజే 8. 71 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా.. నూతన తారలతో రూపొంది, తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘ధడక్‌కు గొప్ప ఆరంభం.. నూతన తారలతో రూపొందినప్పటికీ తొలిరోజే 8.71 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ పేరిట ఉన్న రూ. 8 కోట్ల రికార్డును అధిగమించిందంటూ’ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కాగా ఈ రెండు సినిమాలు కరణ్ జోహారే నిర్మించారు. ‘ధడక్’ సినిమాలో జాన్వీకి జోడీగా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ నటించాడు. ‘బియాండ్ ద క్లౌడ్స్’ సినిమాలో సహాయక పాత్రలో నటించిన ఇషాన్‌కు హీరోగా మాత్రం ఇదే తొలి చిత్రం.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
మళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMTధైర్యం కంటే భయం గొప్పది అంటున్న కొరటాల శివ
21 May 2022 6:55 AM GMT