వివాహితతో సంబంధం.. డీఎస్పీ రాసలీలలు

వివాహితతో సంబంధం.. డీఎస్పీ రాసలీలలు
x
Highlights

పోలీసు అంటే ప్రజలకు అండదండగా ఉంటూ నిరంతరం రక్షణ కల్పిస్తాడు. ప్రజలు తప్పుచేస్తే పోలీసుల దగ్గర న్యాయంకోసం వెళ్తాం అలాంటింది ఒక భాధ్యత గల అధికారంలో ఉండి...

పోలీసు అంటే ప్రజలకు అండదండగా ఉంటూ నిరంతరం రక్షణ కల్పిస్తాడు. ప్రజలు తప్పుచేస్తే పోలీసుల దగ్గర న్యాయంకోసం వెళ్తాం అలాంటింది ఒక భాధ్యత గల అధికారంలో ఉండి ఒక అభం శుభం తెలియని వివాహితకు దొంగ మాటలు చెప్పి, ఉద్యోగం కల్పిస్తాని మాయమాటలతో బుజ్జగించి వివాహితను ఎట్టకేలకు లొంగదిసుకున్నాడు. అయితే ఈ అక్రమసంబంధం కొనసాగిస్తున్న వివాహిత భర్త గుట్టురట్టుచేశాడు. వివరాల్లోకి వెళితే కలిగిరి గ్రామానికి చెందిన రెడ్డిప్రసాద్ కు ఎనిమిదేళ్ల కిందట లగ్గం అయింది. అతను హైదరాబాద్‌లో ఓ ప్రయివేటు సంస్థలో ఫార్మసిస్టుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. కాగా అ ఎరియాలో డీఎస్పీతో పరిచయం ఎర్పడింది. ఈ పరిచయం కాస్తా రెడ్డిప్రసాద్ భార్యమీద కన్నుపడింది డీఎస్పీకి ఇక ఉద్యోగం పెట్టిస్తనని లొంగదిసుకున్నాడు విషయం గమనించిన రెడ్డిప్రసాద్ ఎలాగైన డీఎస్పీ గుట్టురట్టు చేయలనుకున్నాడు అయితే డీఎస్పీ, తన భార్య ఉన్న గదికి తాళం వేసి మీడియా ప్రతినిధులను పిలిచి తాళాలు తీయడంతో డీఎస్పీ, వివాహితతో సంబంధం బట్టబయలైంది. మీడియా రాకను చూసిన డీఎస్పీ అక్కడి నుంచి మెల్లగా జారుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు స్టేషన్‌కు రావాలని చెప్పగా కారులో వస్తానని చెప్పి అక్కడి నుంచి పారారయ్యాడు. దింతో పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. డీఎస్పీ మంగళగిరిలోని ఏపీఎస్పీ 9వ బెటాలియన్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories