కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు..? అనుమానాలు నివృత్తి చేసిన మంత్రులు..

కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు..? అనుమానాలు నివృత్తి చేసిన మంత్రులు..
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని ఇటీవల రూమర్ చెలరేగింది. అందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్బంగా...

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని ఇటీవల రూమర్ చెలరేగింది. అందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్బంగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లు ఒకే వేదికను పంచుకోవడం. అయితే పొత్తు ప్రసక్తే ఉండదని… డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గంటాపదంగా చెబుతున్నారు. గతంలో కూడా తాను ఈ విషయాన్ని చెప్పానని.. అయితే దీనిపై సీఎం తనను వివరణ కోరారంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని కేఈ వివరణ ఇచ్చారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి పొత్తులపై నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే తీసుకుంటారని కేఈ తెలిపారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు రూమర్ ను ఖండించారు. ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉన్నందున ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడుకోవడం అనవసరం అన్నారు. అలాగే మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories