ప్రమాదకర స్థాయికి పడిపోయిన కాలుష్యం...సరి బేసి విధానాన్ని అమలు చేసే యోచనలో ఆప్ సర్కార్

ప్రమాదకర స్థాయికి పడిపోయిన కాలుష్యం...సరి బేసి విధానాన్ని అమలు చేసే యోచనలో ఆప్ సర్కార్
x
Highlights

దేశ రాజధాని ఢిల్లీని మళ్లీ కాలుష్యం కమ్మేసింది. గత ఐదు రోజుల నుంచి కాలుష్యం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను...

దేశ రాజధాని ఢిల్లీని మళ్లీ కాలుష్యం కమ్మేసింది. గత ఐదు రోజుల నుంచి కాలుష్యం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఢిల్లీలో మరోసారి సరి బేసి విధానాన్ని అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటికే కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలు నాటడం, ప్రభుత్వ రవాణాను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి పౌరుడు పాటుపడాలని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు.

కాలుష్యాన్ని తగ్గించేందుకు 2016 లో ఢిల్లీ సర్కారు తొలిసారిగా సరి-బేసి విధానాన్ని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి 15 వరకు సరి-బేసి విధానాన్ని అమలు చేసింది. అదే విధానాన్ని ఈ సారి కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో నిర్మాణ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అత్యవసరం అయితే మినహా ప్రజలు బయటకు రావొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories