నేడు తాడేపల్లి గూడెంలో టీడీపీ ధర్మపోరాట సభ

నేడు తాడేపల్లి గూడెంలో టీడీపీ ధర్మపోరాట సభ
x
Highlights

ఆంధ్రప్రదే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ.. ధర్మ పోరాట సభలను నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది అధికార తెలుగుదేశం పార్టీ....

ఆంధ్రప్రదే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ.. ధర్మ పోరాట సభలను నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది అధికార తెలుగుదేశం పార్టీ. దేశంలో తెలుగుదేశం ప్రభుత్వంపై జరుగుతున్న రాజకీయ కుట్రలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తిరుపతి, ఒంగోలు, విశాఖ, కాకినాడ, కర్నూల్‌ నగరాల్లో సభలు నిర్వహించి సక్సెస్‌ చేసిన టీడీపీ.. ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఆరో ధర్మపోరాట సభకు సిద్ధమైంది. ఆరో సభకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంను ఎంచుకున్నారు.. ఇవాళ జరగనున్న ఆ ధర్మపోరాట సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే జిల్లా నేత‌లంతా అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు ఓ వైపు పెట్టుబడుల ఆకర్షణ.. సంక్షేమ పథకాలతో బిజీగా ఉంటూనే.. ధర్మపోరాట సభలతో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories