పెళ్లి డేట్‌ కన్ఫామ్‌ చేసిన సైనా

పెళ్లి డేట్‌ కన్ఫామ్‌ చేసిన సైనా
x
Highlights

కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ తో గత 11 సంవత్సరాలుగా తాను ప్రేమలో ఉన్నట్లు భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ ప్రకటించింది....

కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ తో గత 11 సంవత్సరాలుగా తాను ప్రేమలో ఉన్నట్లు భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ ప్రకటించింది. డిసెంబర్ 19నే తమ వివాహమని తెలిపింది. 32 ఏళ్ల కశ్యప్, 28 ఏళ్ల సైనా 2005 నుంచి గోపీచంద్ అకాడమీలో కలసి శిక్షణ పొందటమే కాదు భారత జట్టులో సభ్యులుగా వివిధ టోర్నీల్లో పాల్గొంటూ వస్తున్నారు. 2007 నుంచి తాము కలసి మెలసి తిరుగుతున్న విషయం తమ తల్లితండ్రులకు తెలుసని సైనా చెప్పింది. క్రీడాకారులుగా తమతమ లక్ష్యాలు సాధించడం కోసమే వివాహాన్ని వాయిదా వేసుకొంటూ వచ్చామని పెళ్లికి తగిన సమయం వచ్చిందని సైనా వివరించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ తాజా ర్యాకింగ్స్ ప్రకారం పురుషుల సింగిల్స్ లో కశ్యప్ 57వ ర్యాంకులో ఉంటే సైనా మాత్రం 11వ ర్యాంకులో కొనసాగుతూ వస్తోంది. జకార్తా వేదికగా ఇటీవలే ముగిసిన ఆసియాక్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో సైనా కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories