కేంద్రానికి ముచ్చెమటలు పట్టిస్తున్న బీజేపీ ఎంపీ సావిత్రిబాయి ఫూలే

బీజేపీ ఎంపీ తిరుగుబాటు చేశారు. ఎస్సీ ఎస్టీల కు రిజర్వేషన్లను ఎత్తివేయడానికి కుట్ర జరుగుతోందంటూ ఆందోళ...
బీజేపీ ఎంపీ తిరుగుబాటు చేశారు. ఎస్సీ ఎస్టీల కు రిజర్వేషన్లను ఎత్తివేయడానికి కుట్ర జరుగుతోందంటూ ఆందోళ వ్యక్తం చేశారు. సొంత పార్టీ తీరుపై విమర్శలు చేస్తూ ఏప్రిల్ 1న లక్నోలో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు హెచ్చరించారు.
బీజేపీకి చెందిన ఎంపీ బీజేపీ మీద చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు పెద్ద అస్త్రంగా మారబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బెహ్రయిచ్ ఎంపీ సీటు నుంచి ఆమె తొలిసారిగా ఎంపికయ్యారు. ఎస్పీ అభ్యర్థిని 90వేల ఓట్ల తేడాతో ఓడించి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అయితే తాజాగా బీజేపీలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చర్చ సాగుతోందంటూ సాధ్వీ సావిత్రిబాయి ఫూలే ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. సొంత పార్టీపైనే మహిళా ఎంపీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను తొలగించేందుకు పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. రిజర్వేషన్ల అంతానికి కుట్ర జరుగుతున్నా, ప్రభుత్వం మౌన ప్రేక్షకుడి మాదిరిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను సమీక్షించాలంటూ బీజేపీలో నిరంతరం చర్చ జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆమె వ్యవహారం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల యూపీ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న బీజేపీకి తాజా పరిణామాలు మింగుడుపడే అవకాశం లేదు.
బీజేపీలో మోడీకి వ్యతిరేకంగా సాగుతున్న వ్యవహారాలకు ఆమె వ్యాఖ్యలు ఉదాహరణగా చెబుతున్నారు. అవిశ్వాసం పార్లమెంట్ లో చర్చకు రాకుండా కేంద్రం అడ్డుకోవడానికి ఇలాంటి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. సావిత్రి సహా పలువురు ఉత్తరాది ఎంపీలు, వివిధ అసమ్మతి వర్గాలు మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు భావిస్తున్నారు. దానిలో భాగంగానే సావిత్రి తెరమీదకు వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల నేపత్యంలో 18శాతం దళితులున్న రాష్ట్రంలో రిజర్వేషన్ల మీద ఆమె చేసిన వ్యాఖ్యలు బీజేపీకి తీరని నష్టం చేసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఏమైనా బీజేపీలో మారుతున్న పరిణామాలు మోడీకి చెమటలు పట్టించేలా మారతాయనే అభిప్రాయం అక్కడక్కడా వ్యక్తం అవుతోంది.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT