దాచేపల్లి రేప్‌ కేసు నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య

దాచేపల్లి రేప్‌ కేసు నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య
x
Highlights

దాచేపల్లి అత్యాచార నిందితుడు రామసుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. గురజాల మండలం దైద దగ్గర ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దైద అమరలింగేశ్వర స్వామి...

దాచేపల్లి అత్యాచార నిందితుడు రామసుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. గురజాల మండలం దైద దగ్గర ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దైద అమరలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర్లోని ఓ చెట్టుకు సుబ్బయ్య ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహం సుబ్బయ్యదేనని హోం మంత్రి చినరాజప్ప నిర్థారించారు.ఈ మేరకు పోలీసులు ఫొటోలు విడుదల చేశారు.

సుబ్బయ్య తన బంధువులతో చెప్పినట్లుగానే ప్రాణాలు తీసుకున్నాడు. రామ సుబ్బయ్య బంధువులతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు...తాను చనిపోతున్నానని చెప్పాడు. అన్నట్లుగానే అదే పని చేశాడు. సుబ్బయ్య సెల్ ఫోన్ సంబాషణ గురించి తెలుసుకున్న పోలీసులు... సిగ్నల్స్‌ను ట్రాక్ చేయగా..దాచేపల్లి సమీపంలోని తంగెడ గ్రామంలోని సెల్ టవర్ పరిధిని చూపించింది. దీని సమీపంలోనే కృష్ణా నది ఉండటంతో...నదిలో దూకి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే కోణంలో పోలీసులు కృష్ణానదిలో పడవలతో , నది ఒడ్డున డ్రోన్ కెమేరాల ద్వారా గాలింపు చేపట్టారు. చివరికి సుబ్బయ్య చెట్టుకు వేలాడుతూ శవంగా కనిపించాడు.

దాచేపల్లి అత్యాచార ఘటనపై భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగడం..సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోవడంతో సుబ్బయ్యను పట్టుకునేందుకు పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సుబ్బయ్య ఆచూకీ కనిపెట్టడానికి డ్రోన్లను కూడా వాడారు. కానీ నిందితుణ్ణి ప్రాణాలతో పట్టుకోలేకపోయారు. అయితే సుబ్బయ్య ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నదీ వైద్య పరీక్షల్లోనే తేలుతుందని డీజీపీ అన్నారు.

సుబ్బయ్య చివరిసారి బంధువులో మాట్లాడిన ఫోడ్ కాల్ ఆడియో పోలీసులు విడుదల చేవారు. అత్యాచార ఘటనపై ఆయన పశ్చాత్తాప పడినట్లు కనిపిస్తోంది. తాను చేయకూడని పని చేశానని సుబ్బయ్య బంధువుతో చెప్పుకొచ్చాడు. తను చేసిన పని వల్ల తన కొడుకు పరువు పోయిందని అన్నాడు. పది మందికి మంచి మాటలు చెప్పే నేను ..చాలా తప్పుడు పని చేశానని అన్నాడు. నా ఖర్మ కాలి పాపపు పని చేశాననీ..బతకాలని లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాను చావడానికే వెళ్తున్నానని అన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories