ఏపీకి అక్టోబర్‌ భయం...ఆ రెండు తేదీల్లో తుపాను బీభత్సం...అక్టోబర్‌లో తుపాన్లకు కారణమేంటి?

ఏపీకి అక్టోబర్‌ భయం...ఆ రెండు తేదీల్లో తుపాను బీభత్సం...అక్టోబర్‌లో తుపాన్లకు కారణమేంటి?
x
Highlights

ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రానికి అక్టోబర్‌ నెల శాపంగా తయారైందా? ఈనెలలోనే ఎక్కువగా విపత్తులు సంభవిస్తున్నాయా? అంటే పరిస్థితులను గమనిస్తే నిజమే...

ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రానికి అక్టోబర్‌ నెల శాపంగా తయారైందా? ఈనెలలోనే ఎక్కువగా విపత్తులు సంభవిస్తున్నాయా? అంటే పరిస్థితులను గమనిస్తే నిజమే అనుకోవాల్సిన వస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పెను విషాద తుపాన్‌ ఘటనలన్నీ అక్టోబర్‌లోనే జరుగుతుండటం యాదృచ్ఛికమా? లేక కాలప్రభావమా? లేదా ఇంకేదైనా కారణమా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఏపీలో ఏటా ఈ నెలలోనే తుపానులు విరుచుకుపడుతున్నాయి. 1991, 1993, 1996ల్లో అక్టోబర్‌ నెలలోనే వరుస విపత్తులు పలు ప్రాంతాలను దెబ్బతీశాయి. 1999 అక్టోబరు 18న గోపాలపూర్‌, అదే నెల 28న పరాదీప్‌ తీరాలను తాకిన పెనుతుపానులు, విరుచుకుపడిన ఉప్పెన వల్ల 30 వేల మందికి పైగా మృతిచెందారు. ఇక 2013 అక్టోబరు 12న గోపాలపూర్‌ తీరం దాటిన పైలిన్‌ తుపాను దక్షిణ ఒడిశాలో విధ్వంసం సృష్టించింది. ప్రజాచైతన్యం, ప్రసార సాధనాల పాత్ర, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ప్రాణనష్టం జరగనప్పటికి ప్రకృతి ప్రకోపానికి కొన్ని నెలల పాటు తీరప్రాంతవాసులు కోలుకోలేదు.

2014 అక్టోబరు 12న విశాఖపట్నం తాకిన హుద్‌హుద్‌ విపత్తు ఇప్పటికి ఓ పీడకలలానే చెప్పుకోవచ్చు. తుపాన్‌ ప్రభావానికి ఉక్కునగరమైన విశాఖ వణికిపోతోంది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతికారు. ఒక్కసారిగా తుపాన్‌ తాకిడికి రూపురేఖలే మారిపోగా కనీవిని ఎరుగని రీతిలో నష్టాన్ని మిగిల్చింది. ఈ వరద ప్రభావం సాగరతీరంపై పెను ప్రభావాన్ని చూపగా వేల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. విశాఖపట్నాన్ని అల్లకల్లోలం చేసి పదిరోజుల పాటూ అంధకారంలో నెట్టేసింది. పచ్చదనంతో నిండిన సాగర నగరాన్ని కొన్ని నెలల పాటూ ఎండిన మానులా చేసింది.

దేశ చరిత్రలో ఇంత తీవ్రమైన తుపాను ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చిందా.? అన్న అనుమానం కలిగేలా, ఆంధ్రప్రదేశ్‌లో హుద్‌హుద్‌ తుపాను బీభత్సం సృష్టించింది. అంచనాలకు అందని విధ్వంసం సృష్టించింది. తుపాన్‌ను నుంచి కోలుకుంటున్న సమయంలోనే గోరుచుట్టు రోకలిపోటు అన్న చందంగా దయె తపాన్‌ పిడుగులా పడింది. అతి తక్కువ సమయంలోనే తుపాన్‌ కాస్త బలహీనపడటంతో పెద్దనష్టం వాటిల్లకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలో అక్టోబరు 8న అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం పెను తుపాన్‌ మ‌రో భీక‌ర తుపానుగా మారింది. టిట్లీ గుప్పిట్లో ఏపీ విలవిలలాడుతోంది.

ఏపీ, ఒడిసా ప్రభుత్వాలను హడలెత్తించిన టిట్లీ తుపాను తీరం దాటింది. ఒడిసాలోని గోపాల్‌పూర్‌ దగ్గర తీరం దాటుతున్న సమయంలో టిట్లీ తీవ్ర స్ధాయిలో విరుచుకుపడింది. తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికింది. ఈదరుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లగా ఇద్దరు మృతి చెందారు. మినీ కోనసీమ ఉద్దానం ప్రాంతంలో పెనుగాలుల ధాటికి కొబ్బరిచెట్లువిరిగిపడ్డాయి. పలాస, టెక్కలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా ..మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories