ముందుకొచ్చిన వైసీపీ.. జగన్ ఆధ్వర్యంలో రెండు టీమ్‌లు..

ముందుకొచ్చిన వైసీపీ.. జగన్ ఆధ్వర్యంలో రెండు టీమ్‌లు..
x
Highlights

శ్రీకాకుళం జిల్లా వరద బీభత్సంతో ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు...

శ్రీకాకుళం జిల్లా వరద బీభత్సంతో ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు, వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతిపక్షం వైసీపీ ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో వరద భాదితుల సహాయార్థం ఆ పార్టీ కోటి రూపాయల ఆర్థికసాయం ప్రకటించింది. ఈ డబ్బును అక్కడ సహాయక చర్యలకు వినియోగిచాలని ఆ పార్టీ నేతలకు సూచించింది. తుఫాను బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించిన వైసీపీ.. మారు మూల గ్రామాల ప్రజలు తుఫాను కారణనంగా సర్వం కోల్పోయారని వారిని పట్టించుకునే వారే లేరని అంటోంది. వరద బాధితులను ఆదుకోవడానికి జగన్‌.. రెండు టీమ్‌లను ఏర్పాటు చేశారని, సహయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories