20లోగా నష్టపరిహారం చెల్లిస్తాం: చంద్రబాబు

20లోగా నష్టపరిహారం చెల్లిస్తాం: చంద్రబాబు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెథాయ్ తుపాన్ విజృంభించింది. తుపాను ధాటికి ఏపీ తడిసి ముద్దైంది. కాగా తుపాను ప్రభావిత ప్రాంతంలో నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెథాయ్ తుపాన్ విజృంభించింది. తుపాను ధాటికి ఏపీ తడిసి ముద్దైంది. కాగా తుపాను ప్రభావిత ప్రాంతంలో నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పర్యటనలో భాగంగా భైరవపాలెంలో తుపాన్ బాధితులను చంద్రబాబు పరమర్శించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తుపాన్ తీరం దాటిన ప్రతి ప్రాంతాన్ని తాను స్వయంగా పరిశీలించానని చెప్పారు. అలాగే తుపాను బాధితులందరికీ వరదసాయం అందిస్తామని భాదితులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. పెథాయ్ తుపాను ధాటికి ఆస్తి నష్టం ఎంత జరిగిందో అంచనా వేస్తున్నామని, ఎవరికీ నష్టం లేకుండా ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామని, ఈ నెల 20వ తేదీనే నష్టపరిహారాన్ని చెల్లిస్తామని, నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని కూడా అదేరోజున అందజేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను పరిష్కరించానని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories