Top
logo

తెలంగాణవ్యాప్తంగా సకల నేరస్థుల సమగ్ర సర్వే

తెలంగాణవ్యాప్తంగా సకల నేరస్థుల సమగ్ర సర్వే
X
Highlights

తెలంగాణవ్యాప్తంగా సకల నేరస్థుల సమగ్ర సర్వే జరుగుతోంది. సకల నేరస్థుల జాబితా కోసం పోలీసులు ఈ సర్వే చేపట్టారు....

తెలంగాణవ్యాప్తంగా సకల నేరస్థుల సమగ్ర సర్వే జరుగుతోంది. సకల నేరస్థుల జాబితా కోసం పోలీసులు ఈ సర్వే చేపట్టారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో సుమారు లక్ష మంది నేరస్థులు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్‌లోని ఐదు జోన్ల పరిధిలోనే 45వేల మందికి పైగా నేరస్థులు ఉండగా, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 20వేల మంది క్రిమినల్స్ ఉన్నారు. ఇక హైదరాబాద్‌లో నేరాలకు పాల్పడి వివిధ ప్రాంతాల్లో ఉన్న నేరస్థులు 7వేల మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే 805మంది బాల నేరస్థులు ఉన్నట్లు గుర్తించారు. నేరస్థుల పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచడంతోపాటు వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకే సకల నేరస్థుల సమగ్ర సర్వే చేపట్టినట్లు తెలిపారు. నేరస్థుల వివరాల సేకరణ పూర్తయ్యే వరకు సర్వే కొనసాగుతుందన్నారు.

జోన్ల వారిగా నేరస్థుల వివరాలు
మాదాపూర్ జోన్ లో మొత్తం 6,000 మంది నేరస్థులు..
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 454 మంది నేరస్థులు
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 232 మంది నేరస్థులు
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 235
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో 1311
KPHB పోలీస్ స్టేషన్ పరిధి లో 983
నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 738
మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 717
చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 601
ఆర్ సి పురం పోలీస్ స్టేషన్ పరిధిలో 523
బచూపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 193 నేరస్థులు ఉన్నారు.

Next Story