logo
జాతీయం

రాజకీయాల్లోకి గంభీర్.. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాడో తెలుసా?

రాజకీయాల్లోకి గంభీర్.. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాడో తెలుసా?
X
Highlights

భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త హల్‌చల్ చేస్తోంది. పేలవ ఫామ్‌...

భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త హల్‌చల్ చేస్తోంది. పేలవ ఫామ్‌ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ గత రెండేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్ రూపంలో మూడు ఫార్మాట్లలో కలిపి నలుగురు రెగ్యులర్ ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల గౌతమ్ గంభీర్ మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయడం కష్టమని భావించే.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఈ ఓపెనర్‌‌ను కలిసిన ఢిల్లీ బీజేపీ నేతలు అతనికి టికెట్‌ ఇవ్వడంపై కూడా స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ నుంచే గంభీర్‌ను బరిలోకి దింపాలని బీజేపీ చూస్తున్నది. దేశానికి సంబంధించి ఏ అంశంపై అయినా స్పందించడానికి గంభీర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ విషయంలో గంభీర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఇది తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్న బీజేపీ.. గౌతీని బరిలోకి దింపడానికి సిద్ధమవుతున్నది.

Next Story