రైలు కింద పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు

x
Highlights

చావు అంచుకు చేరి చివరి క్షణంలో తప్పించుకున్న ఘటనలు సినిమాల్లో తరచూ చూస్తుంటాం. కలలో తప్ప నిజజీవితంలో ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా మాత్రమే చోటు...

చావు అంచుకు చేరి చివరి క్షణంలో తప్పించుకున్న ఘటనలు సినిమాల్లో తరచూ చూస్తుంటాం. కలలో తప్ప నిజజీవితంలో ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా మాత్రమే చోటు చేసుకుంటూ ఉంటాయి. అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఘటన నుంచి ఓ ప్రయాణీకుడు తృటిలో తప్పించుకన్నాడు. రైల్వే పట్టాల మీదుగా ప్లాట్‌ ఫాం మారుతుండగా ఎదురుగా ఓ గూడ్స్ రైలు దూసుకొచ్చింది. దీంతో పట్టాల మధ్యే ప్రయాణీకుడు పడుకున్నాడు. రైలు కింద పట్టాల మధ్య నిమిషం పాటు గడిపిన ప్రయాణీకుడు గూడ్స్ రైలు వెళ్లిన తరువాత పైకి లేచాడు. యువకుడికి ఏం జరుగుతుందోనని ఆందోళన చెందిన చుట్టుపక్కల వారు క్షేమంగా రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. భూమి మీద నూకలు ఉంటే ఎన్నాళ్లైనా బతకొచ్చు అనడానికి ఇదే సాక్షమంటున్నారు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ దృశ్యాలను షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే నిబంధనలు ఉల్లంఘిస్తూ రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన ప్రయాణీకుడిపై రైల్వే శాఖ అధికారులు విచారణ చేపట్టారు. దృశ్యాల ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు యువకుడి కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories