ఈనెల 28న కరువు బంద్: రామకృష్ణ

ఈనెల 28న కరువు బంద్: రామకృష్ణ
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకొని భారత ప్రధాని మోడీజీ ఏపీలో పర్యటించడం తగదని సీపీఐ నేత రామకృష్ణ...


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకొని భారత ప్రధాని మోడీజీ ఏపీలో పర్యటించడం తగదని సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించాడు. నేడు విజయవాడలో తొమ్మిది వామపక్ష పార్టీల నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ డిసెంబర్ 28న కరవు బంద్ నిర్వహించనున్నట్లు రామకృష్ణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల జనవరి 6న మోడీ పర్యటనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మోడీ గో బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమం తెలియజేస్తామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటి వరకు అమలు చేయకపోవాడాన్ని నిరసిస్తూ వచ్చే నెల జనవరి 4న రాజధాని ఢిల్లీలో నిరసన తెలియజేస్తామని రామకృష్ట స్పష్టం చేశారు. తుఫానుతో ప్రజలు విలవిలలాడుతుంటే కనీసం వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం ప్రకటించపోవడం లేదని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories