logo
సినిమా

సాహ‌సం.. సామ‌ర్థ్యం.. మ‌హారావ‌ల్ ర‌త‌న్‌సింగ్‌

సాహ‌సం.. సామ‌ర్థ్యం.. మ‌హారావ‌ల్ ర‌త‌న్‌సింగ్‌
X
Highlights

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్న చారిత్రాత్మ‌క చిత్రం 'ప‌ద్మావ‌తి'. దీపికా ప‌దుకునే, ...

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్న చారిత్రాత్మ‌క చిత్రం 'ప‌ద్మావ‌తి'. దీపికా ప‌దుకునే, ర‌ణ‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ హిందీ చిత్రం డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సెప్టెంబ‌ర్ 20న‌ దీపికా పోషిస్తున్న‌ ప‌ద్మావ‌తి పాత్ర‌ ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసిన చిత్ర బృందం.. ఇవాళ షాహిద్ క‌పూర్ పోషిస్తున్న మ‌హారావ‌ల్ ర‌త‌న్ సింగ్ పాత్ర ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశారు.

సాహ‌సం, సామ‌ర్థ్యం, గౌర‌వానికి ప్ర‌తీక‌గా ఉండే పాత్ర ఇద‌ని చిత్ర బృందం తెలుపుతోంది. ర‌త‌న్ సింగ్‌గా షాహిద్ లుక్ బాగుంద‌ని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. త్వ‌ర‌లోనే ర‌ణ‌వీర్ సింగ్ పోషిస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ ఫ‌స్ట్‌లుక్ ని విడుద‌ల చేయ‌నున్నారు. దాదాపు రూ.300 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ని స‌మాచార‌మ్‌. అంతేకాదు.. రూ.3.5 కోట్ల బ‌డ్జెట్‌ని కేవ‌లం 'ప‌ద్మావ‌తి' ఫ‌స్ట్‌లుక్ కోసం కేటాయించార‌ని బాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Next Story