పార్కుల్లో అలాంటి ప్రవర్తన వల్లే రేప్‌లు: బీజేపీ ఎంపీ

భరత్‌పూర్: ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఒకరు. రాజస్థాన్‌లోని...
భరత్‌పూర్: ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఒకరు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రేప్ జరగడానికి గల కారణాల గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బహిరంగ ప్రదేశాల్లో యువతీయువకుల విచ్చలవిడి ప్రవర్తన అత్యాచారాలకు కారణమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక జంట బైక్‌పై వెళుతుంటే ఒకరినొకరు కౌగిలించుకుంటూ.. ఒకరిని ఒకరు తినేస్తున్నట్లుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సాక్షి మహరాజ్ చెప్పుకొచ్చారు. కార్లలో, పబ్లిక్ ప్లేసుల్లో, పార్కుల్లో యువతీయువకులు చేసే పనులు కూడా అత్యాచారాలకు కారణమవుతున్నాయని ఆయన చెప్పారు.
ఇలాంటి వాటన్నింటినీ ఎవరూ పట్టించుకోరని, కానీ ఎక్కడైనా రేప్ జరిగితే మాత్రం వెంటనే పోలీసులను ప్రతీ ఒక్కరూ తప్పుబడతారని, ఆ వైఖరి సరికాదని సాక్షి మహరాజ్ తెలిపారు. అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో తనకెలాంటి సన్నిహిత సంబంధాలు లేవని సాక్షి మహరాజ్ తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎన్నికల సమయంలో బాబాలతో సన్నిహితంగా మెలుగుతున్నారని, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం డేరా బాబాను జైలుకు పంపి దొంగ బాబాల విషయంలో తమ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో నేరాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఎంపీ సాక్షి మహరాజ్ సూచించారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT