logo
జాతీయం

ఓటేసిన తర్వాతే పెళ్లి..!

ఓటేసిన తర్వాతే పెళ్లి..!
X
Highlights

ఓటుహక్కును వినియోగించుకోవడంలో గుజరాత్ ప్రజలు అత్యంత ఉత్సాహం చూపుతున్నారు. పెళ్లిపీటలు ఎక్కబోతున్న నూతన...

ఓటుహక్కును వినియోగించుకోవడంలో గుజరాత్ ప్రజలు అత్యంత ఉత్సాహం చూపుతున్నారు. పెళ్లిపీటలు ఎక్కబోతున్న నూతన వధూవరులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసిన తర్వాత పెళ్లిపీటలు ఎక్కారు. ఈ ఘటన బరూచ్‌ జిల్లా బహుమలిలో చోటుచేసుకుంది. వివాహానికి ముందు నూతన వధూవరులు తరలివచ్చి..ఓటు చేయడంతో పలువురు వారిని అభినందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఐదోసారీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ.. 22 ఏళ్ల మళ్లీ పవర్ లోకి రావాలని కాంగ్రెస్‌ భావిస్తుండటంతో ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. బీజేపీ మొత్తం 89 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ రెండు స్థానాలు మినహా 87 స్థానాల్లో పోటీ చేసింది. బీఎస్పీ 64చోట్ల, ఎన్సీపీ 30 స్థానాల్లో పోటీపడుతున్నాయి.

Next Story