Top
logo

అక్కినేని నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో విషాదం

అక్కినేని నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో విషాదం
X
Highlights

సినీ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ పనిచేసే ఇద్దరు దంపతులు...

సినీ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ పనిచేసే ఇద్దరు దంపతులు కరెంట్ షాక్ కొట్టి మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు (36), దుర్గ (32) దంపతులు. వారు కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ శివారులో గల సినీహీరో నాగార్జునకు చెందిన వ్యవసాయం క్షేత్రంలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాత్రి ఇంట్లో కరెంట్ పోవడంతో పొలంలోనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. విద్యుత్ ప్రవహిస్తున్న తెగిపడిన వైర్ ను గమనించక దాన్ని తాకాడు. కరెంట్ షాక్ తో భర్త విలవిల్లాడుతుంటే, అతన్ని కాపాడేందుకు దుర్గ ప్రయత్నించగా, ఆమెకూ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Next Story