తవ్వేకొద్ది బయట పడుతున్న వెంకట్రావు ఆస్తులు

తవ్వేకొద్ది బయట పడుతున్న వెంకట్రావు ఆస్తులు
x
Highlights

విశాఖ‌లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడిన వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావ్ కేసులో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గత 5 రోజుల నుండి...

విశాఖ‌లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడిన వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావ్ కేసులో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గత 5 రోజుల నుండి ఏసిబి అధికారులు వెంకట్రావ్‌తో పాటు అతని స్నేహితులు, బంధువుల ఇళ్లలోను సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 450 కోట్లు పైబడి ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. వెంట్రావ్‌కు భారీగా ఆస్తులు, బంగారం, బ్యాంక్ బ్యాలేన్స్, డిపాజిట్ల‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2003‌లో కూడా వెంకట్రావ్‌పై ఏసిబి కేసు నమోదు కాగా అప్పట్లో కోటి రుపాయలకు పైబడి అక్రమాస్తులను గుర్తించారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, మొత్తం పరిశీలించాక వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories