చూసుకుందాం... తేల్చుకుందామంటున్న కాంగ్రెస్‌

చూసుకుందాం... తేల్చుకుందామంటున్న కాంగ్రెస్‌
x
Highlights

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు ఢీ అంటే ఢీ అంటోంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. కులాల వారీగా సభలు పెట్టి టీఆర్ ఎస్ సంక్షేమ పథకాలను వల్లెవేస్తుంటే, అదే...

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు ఢీ అంటే ఢీ అంటోంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. కులాల వారీగా సభలు పెట్టి టీఆర్ ఎస్ సంక్షేమ పథకాలను వల్లెవేస్తుంటే, అదే తరహాలో కాంగ్రెస్ ఆయా కులాలకు డిక్లరేషన్‌లు ప్రకటిస్తోంది. ఇప్పటికే తాము ప్రకటించిన మూడు డిక్లరేషన్ లకు మంచి స్పందన రావడంతో త్వరలో మరిన్ని వర్గాలకు డిక్లరేషన్‌లు ప్రకటించనుంది.

ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఖచ్ఛితంగా పాటిస్తోంది. అధికార టిఆర్ఎస్ కులాల వారిగా సభలు, సమావేశాలు నిర్వహించి వరాలు జల్లు కురిపిస్తోంది. ఆయా వర్గాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అదే బాటలో నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలను సభల్లో వివరించడంతో పాటు వివిధ కులాలకు డిక్లరేషన్ లు ప్రకటిస్తోంది. ఆయా కులాలవారిని ఆకట్టుకునేందుకు తాపత్రయం పడుతోంది.

ఆరు నెలల క్రితం కాంగ్రెస్ మొదటిసారి డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఆర్మూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి రైతు డిక్లరేషన్ ను విడుదల చేసింది. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫి, పంటల భీమా, మద్దతు ధర ఇస్తామని హామీలు ఇచ్చింది. రైతు డిక్లరేషన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో వనపర్తిలో కాంగ్రెస్ నేతలు మహిళా డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఒక్కో మహిళా గ్రూపుకు పదిలక్షల రుణంతో పాటు వివిధ హామీలను గుప్పించారు. కామారెడ్డిలో గిరిజన డిక్లరేషన్‌ను ప్రకటించారు. జనాభా ప్రతిపాదికన గిరిజనులకు రిజర్వేషన్లతో పాటు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు.

డిక్లరేషన్‌లకు పాటిజివ్ టాక్ వస్తుండడంతో కాంగ్రెస్ నేతలు మంచి జోష్ లో ఉన్నారు. త్వరలో యూత్, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లను ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఎంత మేరకు లబ్ధి కలుగుతుందో వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories