కూటమి పార్టీలకు షాక్‌... కాంగ్రెస్‌ తేల్చిందేమిటసలు

కూటమి పార్టీలకు షాక్‌... కాంగ్రెస్‌ తేల్చిందేమిటసలు
x
Highlights

కళ్లు కాయలు కాసేలా అభ్యర్థులు, నేతలు ఎదురుచూసిన కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు విడుదలైంది. అయితే మహాకూటమిలో మిత్రపక్షాలైన టీజేఎస్, సీపీఐలు కోరిన...

కళ్లు కాయలు కాసేలా అభ్యర్థులు, నేతలు ఎదురుచూసిన కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు విడుదలైంది. అయితే మహాకూటమిలో మిత్రపక్షాలైన టీజేఎస్, సీపీఐలు కోరిన స్థానాల్లో సైతం కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించి.. షాక్ ఇచ్చింది. వరుస భేటీలు, గంటల కొద్ది చర్చలు, మరెన్నో సమాలోచనలు.. సీట్లపై ఎడతెగని పంచాయతీలు.. తెలంగాణలో మహా కూటమి ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవి. చివరకి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకు కూడా సీట్ల సర్ధుబాటుపై భాగస్వామ్య పార్టీలకు క్లారిటీ రాని పరిస్థితి. అయితే, ప్రజలు ఎదురుచూసిన కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు విడుదల అయ్యింది. అధికార టీఆర్ఎస్ పై పోటీచేసే తమ అభ్యర్థులను ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రకటించింది. అధిష్టానం 65 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితా కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన టీజేఎస్, సీపీఐలను కలవర పెడుతోంది.

టీజేఎస్, సీపీఐ కోరిన పలు స్థానాల్లో కూడా కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇరు పార్టీ భారీ షాక్ కి గురయ్యాయి. తెలంగాణ జనసమితి మొదటి నుంచి తమకు పట్టున్న స్థానాల్లో సీట్లు కేటాయించాలని పట్టుపడుతోంది. సీపీఐ సైతం తామ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో టికెట్లు కేటాయించాలని పట్టుపట్టింది. సీట్ల సర్థుబాటులో భాగంగా తాము ఆశించిన సీట్లు దక్కుతాయని భారీగా ఆశాలు పెట్టుకున్నాయి. అయితే, హస్తం పార్టీ మాత్రం.. రామగుండం, స్టేషన్ ఘనపూర్, ఆసిఫాబాద్, కొత్తగూడం, మునుగోడులో కూడా తమ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక ఇంటిపార్టీ అభ్యర్థికి వస్తుందనుకున్న నకారికల్ టికెట్‌ను కూడా తమ కోటాలోనే వేసుకుంది కాంగ్రెస్. ఈ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి లింగయ్యకు కేటాయించింది. అయితే కోదండరాం ఆశిస్తున్న జనగాం స్థానాన్ని ప్రకటించకుండా.. అక్కడ నుంచి బరిలోకి దిగాలని ఆశతో ఉన్న పీసీసీ మాజీ చీఫ్ పొన్నాలకు షాక్ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories