ఛత్తీస్ గఢ్ లో 15 ఏళ్ల తర్వాత హస్తం హవా

ఛత్తీస్ గఢ్ లో 15 ఏళ్ల తర్వాత హస్తం హవా
x
Highlights

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సన్నాహకంగా సెమీఫైనల్స్ పేరుతో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పుంజుకొంది. అధికార...

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సన్నాహకంగా సెమీఫైనల్స్ పేరుతో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పుంజుకొంది. అధికార బీజెపీకి దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. కమలనాథులు అధికారంలో ఉన్న మూడురాష్ట్రాలలో పాగా వేసింది. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని హస్తగతం చేసుకొంది. దేశంలోని ఐదురాష్ట్రాల ఓటర్లతో పాటు కోట్లాదిమంది భారతీయులను గత కొద్దివారాలుగా కదిపి కుదిపేసిన ఎన్నికల ఫలితాలు విశ్లేషకులు ఊహించిన విధంగానే ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే వచ్చాయి.

బీజెపీ పాలిత మూడు రాష్ట్రాలలోనూ తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్ష కాంగ్రెస్ తన విజయానికి మెట్లుగా చేసుకొని15 ఏళ్ల విరామం తర్వాత ఛత్తీస్ గఢ్ లో అధికారం చేజిక్కించుకొంది. గత 15 సంవత్సరాలుగా రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఛత్తీస్ గఢ్ లో అధికారం చెలాయించిన అధికార బీజెపీకి వ్యతిరేకంగా ఓటర్లు ఈసారి తిరుగులేని తీర్పు చెప్పారు. ఛత్తీస్ గడ్ అసెంబ్లీలోని 90 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ 63 సీట్లు కొల్లగొడితే బీజెపీ 17 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

2003 నుంచి ఛత్తీస్ గఢ్ లో అధికారపార్టీగా ఉన్న బీజెపీ 2013 ఎన్నికల్లో 49 సీట్లతో పాటు 41 శాతం ఓట్లు సంపాదించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం 39 సీట్లతో 40.3 శాతం ఓట్లు సాధించింది. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ కాంగ్రెస్ నుంచి వేరుపడి సొంతకుంపటి పెట్టినా కాంగ్రెస్ విజయాన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. గత మూడు విడతలుగా ప్రతిపక్షల అనైక్యత, ఓట్ల చీలికతో విజయం అందుకొంటూ వచ్చిన రమణ్ సింగ్ ప్రభుత్వం ఈసారి బోల్తా కొట్టక తప్పలేదు. ప్రస్తుత ఎన్నికల్లో బీజెపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన అతిపెద్ద విజయం ఛత్తీస్ గఢ్ లో మాత్రమే సాధించడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories