ఆసక్తి రేపుతోన్న సీఫోర్స్ సర్వే

కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా ? బీజేపీకి భంగపాటు తప్పదా ? జేడీఎస్ మూడో స్థానంలో...
కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా ? బీజేపీకి భంగపాటు తప్పదా ? జేడీఎస్ మూడో స్థానంలో సరిపెట్టుకుంటుందా ? ఇప్పటికే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి కర్ణాటక ఓటర్లు షాకివ్వనున్నారా ? సిద్ధరామయ్య మరోసారి సీఎం కావడం ఖాయమేనని సీ ఫోర్స్ సర్వేలో తేలింది. గతం ఎన్నికల కంటే ఈ సారి ఓట్ల శాతం పెరుగుతుందని అంచనా వేసింది.
కర్ణాటకలో అధికారం చేపడుదామనుకున్న బీజేపీకి మరోసారి భంగపాటు తప్పదని సీ ఫోర్స్ సర్వే తేల్చింది. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలింది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 112 నుంచి 126 సీట్లు సాధిస్తుందని సీ ఫోర్స్ సర్వే తెలిపింది. ఓటర్ల శాతం కూడా కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా పెరగనుంది. 2013లో 119 నుంచి 120 స్థానాలు వస్తాయని సీ ఫోర్స్ చెప్పింది. సర్వేలో వచ్చిన విధంగానే కాంగ్రెస్‌కు ఎన్నికల్లో 122 స్థానాలు వచ్చాయ్.
తాజాగా సీ ఫోర్స్ అనే సంస్థ మార్చి 1 నుంచి 25 వరకు 154 నియోజకవర్గాల్లో...22వేల 357 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. 326 నగరాలు, 977 గ్రామాల్లో 2వేల 368 బూత్‌ల పరిధిలో నిర్వహించిన సర్వే నిర్వహించింది సీ ఫోర్స్. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 9శాతం ఓట్లు పెరుగుతాయని అంచనా వేసింది. 2013లో వచ్చిన సీట్ల కంటే ఈ సారి నాలుగు సీట్లు ఎక్కువ వస్తాయని తేల్చింది. 31శాతం ఓట్లతో బీజేపీకి 70 సీట్లు, 16శాతం ఓట్లతో జేడీఎస్‌కు 27 స్థానాలు వస్తాయని సీ ఫోర్స్ సర్వేలో వెల్లడైంది.
బెంగుళూరు పరిధిలోని 28 అసెంబ్లీ స్థానాల్లో 19 కాంగ్రెస్ పార్టీకే వస్తాయన్న సర్వే పాత మైసూర్ రీజియన్ 33 స్థానాలు కైవసం చేసుకుంటుందని సీఫోర్స్ సర్వేలో వెల్లడైంది. సీఎం సిద్ధరామయ్యకు 45 శాతం మంది జై కొడితే 26 శాతం మంది యడ్యూరప్పకు ఓకే చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బకు మరోసారి బీజేపీ ప్రతిపక్షానికే పరిమితం కానుందని సీ ఫోర్స్ తేలింది.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
CIBIL Score: పర్సనల్ లోన్‌కి అర్హులా కాదా అంటే సిబిల్ స్కోరు...
14 Aug 2022 11:30 AM GMTBandi Sanjay: ఆలేరు నియోజకవర్గం తుర్కల షాపూర్లో ప్రజాసంగ్రామ యాత్ర
14 Aug 2022 11:27 AM GMTవైసీపీ ప్రభుత్వ అసమర్థ పనితీరు వల్లే...రాష్ట్రానికి పెట్టుబడులు రావడం...
14 Aug 2022 11:05 AM GMTStress: ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన ఒత్తిడి.. ఎలా బయటపడాలంటే..?
14 Aug 2022 10:30 AM GMTఖమ్మం జిల్లా ఖాన్‌పేట్‌లో భట్టి విక్రమార్క పాదయాత్ర
14 Aug 2022 10:27 AM GMT