నేడు చంద్రబాబును కలవనున్న కాంగ్రెస్ అగ్రనేత

నేడు చంద్రబాబును కలవనున్న కాంగ్రెస్ అగ్రనేత
x
Highlights

దేశవ్యాప్తంగా బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మోడీ నిర్ణయాలు దేశానికీ ప్రమాదకరమనే నినాదంతో దేశవ్యాప్తంగా...

దేశవ్యాప్తంగా బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మోడీ నిర్ణయాలు దేశానికీ ప్రమాదకరమనే నినాదంతో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ పార్టీలను ఏకం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు రాహుల్ గాంధీ దూతగా ఆపార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్ నేడు అమరావతిలో చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈబేటీలో కూటమి కసరత్తు , భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న మాజీప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి, నిన్న(శుక్రవారం) డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశమైయ్యారు. ఇందులోనే భాగంగానే నేడు చంద్రబాబుతో అశోక్‌ గెహ్లాట్ సమావేశమై పొత్తు గురించి చర్చించే అవకాశమున్నట్టు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories