బ్రేకింగ్ : టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైన కాంగ్రెస్ నేత

బ్రేకింగ్ : టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైన కాంగ్రెస్ నేత
x
Highlights

మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సందర్బంగా జంపింగులు ఊపందుకున్నాయి. ఈ వరుసలో ముందున్నారు.. కాంగ్రెస్ నేత, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే...

మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సందర్బంగా జంపింగులు ఊపందుకున్నాయి. ఈ వరుసలో ముందున్నారు.. కాంగ్రెస్ నేత, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. అయన ఇవాళ రాత్రికో(గురువారం) లేదా రేపు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. తన ఫామ్ హౌస్ లో ఇప్పటికే తెరాస నేతలతో చర్చలు జరిపారు కెఎల్ఆర్.. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి ఉన్నప్పటికీ కెఎల్ఆర్ వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. ఇవాళ ప్రకటించిన జాబితాలో మేడ్చల్ నియోజగవర్గానికి అభ్యర్థిని పెండింగ్ లో పెట్టడానికి కారణం కూడా ఇదే అని తెలుస్తోంది. కెఎల్ఆర్ పార్టీ మారతారని తెలియయడంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఆయనతో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోనులో మాట్లాడినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories