కాంగ్రెస్ ప్రజా మేనిఫేస్టో ఇదే.. రూ.. 2లక్షలు..

కాంగ్రెస్ ప్రజా మేనిఫేస్టో ఇదే.. రూ.. 2లక్షలు..
x
Highlights

ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రజా మేనిఫేస్టోను విడుదల చేసింది. దాదాపు 35 అంశాలతో 112 పేజీలతో రూపొందించిన మేనిఫేస్టోను మంగళవారం గాంధీభవన్‌లో...

ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రజా మేనిఫేస్టోను విడుదల చేసింది. దాదాపు 35 అంశాలతో 112 పేజీలతో రూపొందించిన మేనిఫేస్టోను మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ కుంతియా, సీనియర్‌ నేత జైరాం రమేష్‌, పార్టీ ముఖ్య నాయకులు కలసి విడుదల చేశారు. రైతులు, యువత, వైద్యరంగాల సంక్షేమంతో పాటు పలు కీలకమైన అంశాలను ప్రధానంగా మేనిఫేస్టోలో పొందుపరిచారు.అలాగే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని, ప్రతీ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. కాగా ఈ ప్రజా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఇలా ఉన్నాయి.

*ధరల స్థిరీకరణ కోసం 500 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌

*ఎస్సీ వర్గీకరణ చేపట్టడం

*టీఎస్‌ను టీజీగా మార్చుటం

*ఏకకాలంలో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ

*పంటలకు మద్దతు ధర

*అర్హులైన పేదలందరికీ ఆరోగ్య శ్రీ కింద అన్ని వ్యాధులకు ఐదు లక్షల వరకు వర్తింపచేయటం

Show Full Article
Print Article
Next Story
More Stories