ప్రజాకర్షక పథకాలు పగ్గాలప్పగిస్తాయా?

ప్రజాకర్షక పథకాలు పగ్గాలప్పగిస్తాయా?
x
Highlights

కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు మ్యానిఫెస్టోను సిద్దం చేస్తోంది కాంగ్రెస్‌. టీఆర్ఎస్‌ స్కీమ్‌లకు పోటాపోటీగా ప్రజాకర్షక విధానాలను వండివారుస్తోంది. ప్రజల...

కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు మ్యానిఫెస్టోను సిద్దం చేస్తోంది కాంగ్రెస్‌. టీఆర్ఎస్‌ స్కీమ్‌లకు పోటాపోటీగా ప్రజాకర్షక విధానాలను వండివారుస్తోంది. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా ప్రణాళిక ఉంటుందని చెబుతోంది. పాత పథకాలతో పాటు కొత్త పథకాలను మ్యానిఫెస్టోలో చేర్చి, జనంలోకి వెళతామంటోంది. ఇవన్నీ మహాకూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోలో చేర్చి, ప్రజల్లోకి వెళతామంటోంది. అసలు మ్యానిఫెస్టోలో ఉన్న అట్రాక్షన్స్‌ ఏంటి? తెలంగాణ పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ నేతృత్వంలో, రకరకాల ప్రజాకర్షక పథకాలపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గాంధీభవన్‌లో ఈ కమిటీ సభ్యులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రజా మ్యానిఫెస్టోగా చెబుతున్న కాంగ్రెస్‌, అందుకోసం జనం నుంచి కూడా అభిప్రాయాలు కోరుతోంది. నేరుగా, ఫోన్, మెయిల్స్, వాట్సాప్‌లతో పిటిషన్లు స్వీకరిస్తామని చెబుతోంది. అలాగే జిల్లాల్లోనూ పర్యటించి, స్థానిక అంశాలనూ చేరుస్తామంటోంది.

అయితే ఇప్పటికే పీసీీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీకాంగ్రెస్‌ మేనిఫెస్టో అంశాలను చాలా సందర్భాల్లో ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను వివరించారు. ముఖ్యంగా హౌసింగ్‌ స్కీమ్‌‌కి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్న ఉత్తమ్‌....ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. అదే ఎస్సీఎస్టీలకైతే 6లక్షలు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్‌ బిల్లులు క్లియర్ చేస్తామన్న ఉత్తమ్‌... ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నవారికి మరమ్మతుల కోసం 3లక్షల రూపాయల చొప్పున కేటాయిస్తామని ప్రకటించారు. అన్ని రకాల పెన్షన్లు రెట్టింపు చేస్తామని ఉత్తమ్‌ ప్రకటించారు ఉత్తమ్. అలాగే 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ 5లక్షల రూపాయల బీమా చేయిస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వ,నున్నట్లు తెలిపారు. బంగారు తల్లిలాంటి పాత పథకాల పునరుద్ధరణతోపాటు జనాభా ఆధారంగా సబ్‌ప్లాన్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని, ఎస్సీఎస్టీలకైతే ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.

టీఆర్ఎస్‌కు పోటీగా అనేక పథకాలను మ్యానిఫెస్టోలో చేర్చాలనుకుంటోంది కాంగ్రెస్‌. అయితే మహాకూటమిగా జతకడుతున్నారు కాబట్టి, ఉమ్మడి మ్యానిఫెస్టోపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. కూటమిలో తెలుగుదేశం, సీపీఐ మ్యానిఫెస్టో ప్రాధాన్యాలు బయటకు రాకపోయినా, టీజేఎస్‌ మాత్రం అమరవీరుల ఆశయాలే ఉమ్మడి అజెండాగా ఉండాలంటోంది. అమరుల కుటుంబాలకు ఆర్థికసాయం, ఉద్యోగ కల్పన వాటి సాధ్యాసాధ్యాలపై కూలంకశంగా కూటమిలో చర్చిస్తున్నారు.

కూటమి కోసం ఉమ్మడి ఏజెండాను ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిలో ఏయే పార్టీలు ఉంటాయో...ఆయా పార్టీలన్నీ కలిపి ఒక ఉమ్మడి మ్యానిఫెస్టోను రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కూటమిలో ఉండే ఒక్కో పార్టీ ఒక్కో ఏజెండాతో, ఒక్కో మ్యానిఫెస్టోతో వెళితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే, ప్రాథమికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కామన్‌ మినిమిమ్‌ ప్రోగ్రామ్‌పై తీవ్రంగా కసరత్తు జరుగుతోందని కూటమి పార్టీల నేతలు చెబుతన్నారు. అతి త్వరలోనే దీనికి తుదిరూపు ఇచ్చి, ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు. చూడాలి, ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో....

Show Full Article
Print Article
Next Story
More Stories