కుమారస్వామికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఏంటంటే!

కుమారస్వామికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఏంటంటే!
x
Highlights

ఓ వైపు ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ దూసుకుపోతున్న తరుణంలో..రాష్ట్ర అధికార కాంగ్రెస్ జేడీఎస్ ఉపాధ్యక్షుడు కుమారస్వామికి బంపర్ ఆఫర్ ఇచ్చారు....

ఓ వైపు ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ దూసుకుపోతున్న తరుణంలో..రాష్ట్ర అధికార కాంగ్రెస్ జేడీఎస్ ఉపాధ్యక్షుడు కుమారస్వామికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ , జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఇందుకోసం ఎన్ని మంత్రి పదవులు కావాలంటే అన్ని తీసుకోమని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా బెంగళూర్‌లో మకాం వేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌ జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడతో మంతనాలు జరపుతున్నారు. దేవెగౌడ నివాసంలో భేటీ జరుగుతోంది. మీరు సూచించిన వారికే మంత్రి పదవులు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని వారు దేవగౌడను కోరుతున్నారు. మరోవైపు ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఫలితాలు చూస్తే యిట్టె అర్ధమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories