Top
logo

రేవంత్ రెడ్డి ఇళ్లల్లో ముగిసిన సోదాలు.. ఆయనకు ప్రాణహాని ఉంది : సీతక్క

రేవంత్ రెడ్డి ఇళ్లల్లో ముగిసిన సోదాలు.. ఆయనకు ప్రాణహాని ఉంది : సీతక్క
X
Highlights

రేవంత్‌ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి.. గత రెండు రోజులుగా రేవంత్‌ రెడ్డి నివాసం, అతడి బంధువులు, పనివాళ్ల ...

రేవంత్‌ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి.. గత రెండు రోజులుగా రేవంత్‌ రెడ్డి నివాసం, అతడి బంధువులు, పనివాళ్ల ఇళ్లలో మొదలైన సోదాలు.. శుక్రవారం అర్థరాత్రి ముగిసాయి. దాదాపు 31 గంటల పాటు రేవంత్‌ రెడ్డిని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. అక్టోబర్ 2 లేదా మూడో తేదీల్లో తమ ఎదుట హాజరు కావాలని రేవంత్ రెడ్డికి ఐటి అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు శుక్రవారం రేవంత్‌ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్‌ చేస్తారని ప్రచారం కూడా జరగడంతో ఆయన ఇంటికి భారీగా కార్యకర్తలు, అభిమానులు చేరుకుని.. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. రేవంత్‌కు ప్రాణహాని ఉందనే అనుమానం కలుగుతోందని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని గంటల పాటు ఆయన్ను ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన లాయర్ రామారావు మీడియాతో మాట్లాడారు.. రేవంత్‌కు ఆయన కుటుంబ సభ్యులకు ఐటీ అధికారులు 15 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చారు. కానీ అయన సమాధానం చెప్పకపోయే సరికి దాడులు చేశారన్నారు. రూ.300 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపారని తాను సీబీఐకి ఫిర్యాదు చేశానని, కానీ అంతకంటే ఎక్కువే అక్రమాస్తులు గుర్తించినట్లు మీడి యా ద్వారా తెలిసిందన్నారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో మీడియాతో రేవంత్‌ రెడ్డి మాట్లాడే అవకాశముంది.

Next Story