'శ్రీనివాస్‌ హత్య.. సూత్రధారి ఎమ్మెల్యే వీరేశం'

x
Highlights

నల్గొండలో దారుణ హత్యకు గురైన కాంగ్రెస్‌ నేత శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, సీఎల్పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ,...

నల్గొండలో దారుణ హత్యకు గురైన కాంగ్రెస్‌ నేత శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, సీఎల్పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, వీహెచ్‌ పరామర్శించారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ భర్త శ్రీనివాస్‌ హత్య ముమ్మాటికీ ప్రభుత్వానిదే అని ఉత్తమ్‌ అన్నారు. శ్రీనివాస్‌ హత్యలో నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశం ప్రమేయం ఉందంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ప్రాణభయం ఉందని శ్రీనివాస్‌ దంపతులు గతంలోనే సీఎం కేసీఆర్‌కు మొరపెట్టుకున్నారని గుర్తు చేశారు. హత్య జరిగి 48 గంటలు గడుస్తున్నా పోలీసులు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నేర చరిత్ర ఉన్న అధికార పార్టీ నేతలను కేసీఆర్‌ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories