Top
logo

ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి

ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి
X
Highlights

తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఆరుగురు...

తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఆరుగురు ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇచ్చారన్న రేవంత్‌.... ఈ నియామకాలు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీనిపై గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశామన్న ఆయన...దీనిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలకు చెల్లించిన జీతభత్యాలను రికవరీ చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రసమయి, సోమారపు సత్యనారాయణ, వేముల ప్రశాంత్‌రెడ్డి... నిబంధనలకు విరుద్ధంగా పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతానికి లోబడి కేబినెట్ సభ్యులు ఉండాలని, లేదంటే మంత్రులను కూడా తొలగించాలన్నారు.

Next Story