Top
logo

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటారా..?

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటారా..?
X
Highlights

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత... మాజీ మంత్రిగా నగరంలో తనదైన ముద్ర వేసుకున్న నేత.. కొంతకాలంగా పార్టీకి...

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత... మాజీ మంత్రిగా నగరంలో తనదైన ముద్ర వేసుకున్న నేత.. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ముఖేష్ గౌడ్ ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే అందరినీ ఆహ్వానించి ఆత్మీయ సదస్సు నిర్వహించారు. అయితే, ఆయన పార్టీ మారుతున్నట్టు జరుతున్న ప్రచారంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సొంత పార్టీలో ఉంటారా..? లేక గులాబీ గూటికి చేరతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్.. ఆత్మీయ సమ్మేళనం పేరుతో మళ్లీ తెరమీదకొచ్చారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతోపాటు అన్ని పార్టీల్లో తనకు సన్నిహితులనుకున్న వారందరినీ ఆహ్వానించారు. అయితే, తన రాజకీయ ప్రయాణాన్ని పునరుద్ధరించుకోవడం కోసమే అన్నట్టు ఈ ప్రత్యేక సమావేశం ద్వారా చాటిచెప్పారు ముఖేష్ గౌడ్.

గడిచిన ఎన్నికల తర్వాత ముఖేష్ గౌడ్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నగరంలో ఆయనతోపాటు మంత్రిగా పనిచేసిన దానం నాగేందర్ యాక్టివ్‌గా ఉన్నా..ముఖేష్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇప్పడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆత్మీయ సమ్మేళనం పేరుతో రీఎంట్రీ ఇచ్చారు ముఖేష్.

మొన్నా మధ్య ఆయన తనయుడు విక్రం గౌడ్ కాల్పులు వ్యవహారంతో ముఖేష్ కుటుంబం తెరమీదకు వచ్చింది. అప్పుల వ్యవహారం కారణంగానే కాల్పుల తతంగం నడిచినట్టు ప్రచారం జరిగింది. ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉండటం, ఈయన రాజకీయంగా మళ్లీ తెరమీదకు వస్తుండటం పలు అనుమానాలు కలిగిస్తోంది. ముఖేష్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఆయన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఊసే లేదు. కనీసం పార్టీ జెండా కూడా కనిపించలేదు. తన భవిష్యత్ కార్యాచరణ, ఏ పార్టీలో ఉండబోయేది జనవరిలో క్లారిటీ వస్తుందని ముఖేష్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ముఖేష్ మాత్రం పార్టీ మారడానికి, ఆత్మీయ సమ్మేళనానికి ఎలాంటి సంబంధంలేదంటున్నారు ముఖేష్.
మరి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా..? లేక కారెక్కుతారా అన్నది తేలాలంటే జనవరి దాకా వేచిచూడాల్సిందే.

Next Story