వారితో చర్చలు జరిపేందుకు రంగంలోకి దిగిన భక్తచరణ్ దాస్

వారితో చర్చలు జరిపేందుకు రంగంలోకి దిగిన భక్తచరణ్ దాస్
x
Highlights

తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా మహాకూటమిలో సీట్ల పంచాయతీ మాత్రం ఎడతెగడం లేదు. ఏ రోజుకా రోజు సీట్ల సర్దుబాటు లెక్క తేలినట్టు కనిపించినా. మళ్లీ...

తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా మహాకూటమిలో సీట్ల పంచాయతీ మాత్రం ఎడతెగడం లేదు. ఏ రోజుకా రోజు సీట్ల సర్దుబాటు లెక్క తేలినట్టు కనిపించినా. మళ్లీ మొదటికి వస్తోంది. చర్చలతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతోందని కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కూటమిలో భాగంగా కాంగ్రెస్ గెలిచే సీట్లు టీడీపీకి కేటాయించొద్దని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ క్రమంలో కొందరు లీడర్లు తమ అనుచరులతో గాంధీ భవన్ వద్ద ధర్నాకు సైతం దిగారు. దాంతో త్వరలో మొదటి జాభితా ప్రకటించనున్న నేపథ్యంలో పరిశిస్థితిని చక్కదిద్దేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. అసంతృప్తి నేతలతో కాగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ భక్త చరణ్ దాస్‌ సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించేలా కనీసం 25 సీట్లు ఇస్తున్నట్లు భక్తచరణ్ దాస్ తెలిపారు. ఈనెల 12, 13 తేదిల్లో అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామని చెప్పారు. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ ఎవరి దగ్గరా డబ్బు తీసుకోలేదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories