Top
logo

కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదలకు ముహూర్తం ఖరారు

కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదలకు ముహూర్తం ఖరారు
X
Highlights

అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల ఐదున తొలి...

అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల ఐదున తొలి జాబితా విడుదల చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సమాయత్తమైంది. రేపు ఢిల్లీలో జరగబోయే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తొలి జాబితాకు ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. ఈ రోజు సాయంత్రం మహాకూటమిలోని మిగిలిన పక్షాలతో చర్చించనున్న కాంగ్రెస్ నేతలు .. పరస్పర అంగీకారంతో తొలి జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సీనియర్‌, సిట్టింగ్ నేతలు, ఇబ్బందులు లేని వారిని తొలి జాబితాలో చేర్చనున్నారు .

Next Story