Top
logo

పరేడ్ గ్రౌండ్ లో వీహెచ్ పరుగులు

X
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పోలీసులపై చిందులు వేశారు. సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్‌లో సచివాలయం...

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పోలీసులపై చిందులు వేశారు. సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్‌లో సచివాలయం నిర్మించవద్దంటూ ఆందోళన చేస్తున్న వారి టెంట్ తొలగింపుపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఉదయం మార్నింగ్ వాక్‌కు వచ్చిన ఆయన వాకర్స్‌తో కలిసి కాసేపు వాకింగ్ నిర్వహించారు. ఇంతలోనే టెంట్ తొలగించారన్న విషయం తెలుసుకున్న ఆయన .. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలో గ్రౌండ్ మీ అయ్య జాగీరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తాకవద్దంటూ పోలీసులను హెచ్చరించిన ఆయన .. వాస్తు కోసం సచివాలయాలు మారుస్తారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. కేసీఆర్‌కు సలహాలు ఇస్తున్న స్వామీజీలు స్ధలాలు కూడా ఇస్తే బాగుంటుందని వీహెచ్ అన్నారు.

Next Story