గాలితో ఫ్లాస్టిక్ ను తయారు చేయడం ఎలాగో తెలుసా..?

Highlights

గాలి..! అనంత వాయువుల మిశ్రమం. అలాంటి గాలి వల్లే వృక్షాలు, జంతువులు జీవిస్తున్నాయి. మనిషి నీరులేకుండా అయిదు రోజులు జీవించవచ్చు. అన్నం లేకుండా యాభై...

గాలి..! అనంత వాయువుల మిశ్రమం. అలాంటి గాలి వల్లే వృక్షాలు, జంతువులు జీవిస్తున్నాయి. మనిషి నీరులేకుండా అయిదు రోజులు జీవించవచ్చు. అన్నం లేకుండా యాభై అయిదు రోజులు జీవించే అవకాశం ఉంది. కానీ గాలిలేకుండా మనిషి ఐదు నిమిషాలకంటే ఎక్కువ బ్రతకలేడు. అందుకే గాలికి అలాంటి శక్తి ఉంది. కాబట్టే గాలిని వాహనాల్లోకి, మంటలు ఆర్పడానికి ఉపయోగిస్తాం. అలాంటి గాలినే ఇప్పుడు ప్లాస్టిక్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు.
మొన్నీమధ్య ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ముందుండే చైనా గాలి అమ్ముతున్నారనే వార్తలు విన్నాం. అక్కడ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ ఎక్కువ. వాటివల్ల ప్రజలకు వచ్చే అనారోగ్యమూ ఎక్కువే. వాటిని దృష్టిలో పెట్టుకొని చైనా ప్రభుత్వం పరిశుద్ధమైన గాలిని డబ్బాలలో నింపి అమ్ముతున్నారు. ఇప్పుడు అదే గాలిని రకరకలా పద్దతుల ద్వారా ప్లాస్టిక్ తయారీకి ఉపయోగిస్తున్నారు.
అమెరికా కోస్టా మెసా, కాలిఫోర్నియాలో న్యూలైట్ టెక్నాలజిస్ అనే సంస్థ గాలి నుంచి ప్లాస్టిక్ ను తయారు చేస్తుంది. ఇలా తయారు చేయడం వెనుక పెద్ద కథే ఉందని ఆ సంస్థ సీఈవో మార్క్ హెర్మా తెలిపాడు. క్షీణత వాయు ఉద్గారాలు మరియు భూగోళ ఉష్ణోగ్రతలనుంచి తట్టుకునే విధంగా గాలి నుంచి ఫ్లాస్టిక్ ను ఎలా తయారు చేయాలి అనే దానిపై 11 సంవత్సరాలు పరిశోధనలు జరిపినట్లు తెలిపాడు. అనంతరం తన మిత్రుడు కెంటన్ కిమెల్ ఇంటి గ్యారేజీలో తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. మొదట గ్యాస్ నుంచి ప్లాస్టిక్ ను తయారు చేయాలని ప్రతిపాదనలు రావడంతో పెద్ద మొత్తంలో నిధులు ఖర్చుచేయాల్ని ఉండగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నామని హెర్మా చెప్పాడు.
దీని తయారీ విధానం:
విద్యుత్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో అంటే పచ్చని పొలాలు, లోతట్టు, ఎత్తు, 50 అడుగుల ఎత్తైన రియాక్టర్ల ద్వారా గాలిని సేకరిస్తారు. అలా సేకరించిన గాలిని కార్బన్ మరియు ఆక్సిజన్ న్ గొట్టాల్లోకి నింపుతారు. నింపిన వాటిని కరిగించగా చిన్న చిన్న గుళికళుగా తయారవుతాయి. అలా మారిన గుళికలతో మనకు కావాల్సిన సెల్ ఫోన్ కేసులు, బ్యాగులు, సబ్బు పెట్టలు తయారు చేసుకోవచ్చు. ఈ వస్తువులే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని కంపెనీ ప్రతినిథులు తెలిపారు.
గాలితో ఫ్లాస్టిక్ తయారు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రముఖ సంస్థ “డెల్” కంప్యూటర్లలో ఉపయోగించే కార్బన్ బ్యాగ్ లను కొనుగోలు చేసేందుకు ముందుకువచ్చింది.
అయితే ప్రస్తుతం అమెరికాలో దీని మార్కెట్ విలువ $380 మిలియన్లు ఉందని అమెరికా శాస్త్రవేత్త బెర్క్లే తెలిపాడు.
మరోవైపు గాలి నుంచి ప్లాస్టిక్ పుస్తకాలు తయారు చేయాలని తమ జీవిత ఆశయమని న్యూలైట్ టెక్నాలజిస్ సంస్థ సీఈవో మార్క్ హెర్మా ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories