అయనకోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతా : నటుడు పృద్వి

అయనకోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతా : నటుడు పృద్వి
x
Highlights

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్షంగా తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు నటుడు పృథ్వి. ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్షంగా తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు నటుడు పృథ్వి. ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను 2014 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని పార్టీ గెలుపుకోసం అధ్యక్షుడు ఏ పని చెబితే అది చెయ్యడానికి సిద్ధమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంనుంచి అయినా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ.. 'ప్రస్తుతం పోటీ చేసే స్థానాలు ఖాళీగా లేవని ఒకవేళ తనను పోటీకి దిగాలని అధినేత సూచిస్తే తప్పకుండా బరిలో ఉంటానని అన్నారు. అంతేకాదు అయన కోసం, పార్టీ గెలుపుకోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాను' అని అన్నారు. పార్టీ పిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటిస్తానని అన్నారు. అంతేకాదు ఎన్నికల రావడానికి ఏడాది సమయం మాత్రమే ఉన్నందున పార్టీకి తనవంతు సాయం చెయ్యడానికి ప్రణాళిక తయారుచేసుకుంటున్నట్టు వెల్లడించారు పృథ్వీ.

Show Full Article
Print Article
Next Story
More Stories