మద్యం మత్తులో కారు కింద నక్కిన ప్రముఖ యంగ్ కమెడియన్

Highlights

పోలీసులు శనివారం అర్ధరాత్రి జూబ్లిహిల్స్‌లో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు ఎప్పటిలాగే డ్రంక్‌ అండ్‌...

పోలీసులు శనివారం అర్ధరాత్రి జూబ్లిహిల్స్‌లో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు ఎప్పటిలాగే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించగా.. పలువురు యువతులపాటు మరికొందరు మద్యం తాగి వాహనం నడుపుతూ దొరికిపోయారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో టాలీవుడ్‌కు చెందిన యంగ్ కమెడియన్ నవీన్(కుమారి 21ఎఫ్ ఫేమ్) కూడా ఉన్నాడు. తప్పతాగి వాహనాన్ని నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అనంతరం మీడియాను చూసి భయంతో కారు క్రింద నక్కి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. నవీన్‌పై కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు, ఆయన కారును సీజ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories