మా క‌లెక్ట‌రమ్మ పెళ్లికూతురాయ‌నే

మా క‌లెక్ట‌రమ్మ పెళ్లికూతురాయ‌నే
x
Highlights

పనిలో చరుకుదనం, మాటల్లో చలాకితనం తెలంగాణలోనే డైనమిక్‌ కలెక్టర్‌గా దూసుకుపోతున్న వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు....

పనిలో చరుకుదనం, మాటల్లో చలాకితనం తెలంగాణలోనే డైనమిక్‌ కలెక్టర్‌గా దూసుకుపోతున్న వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఢిల్లీకి చెందిన సమీర్ 2011లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. విశాఖ జిల్లాకు చెందిన ఆమ్రపాలి ఉత్తరాదికి చెందిన ఐపీఎస్‌ కొంత కాలం నుంచి ప్రేమికులు. ఈ జంట ఫిబ్రవరి 18న పెద్దల సమక్షంలో ఒక్కటికానున్నట్టు సమాచారం.

సమీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ ఎస్పీగా పని చేస్తున్నారు. ఆమ్రపాలి తండ్రి విశాఖపట్నానికి చెందిన కాట వెంకటరెడ్డి. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్‌ కాకముందు జూనియర్ రిలేషన్‌షిప్ బ్యాంకర్‌గా పని చేశారు. 2010లో సివిల్స్‌ రాసి 39వ ర్యాంక్ సాధించారు. మంచి ర్యాంక్ రావడంతో సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి అనంతరం మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు.

ఇక 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఆమ్రపాలిని వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా నియమించింది. యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ అయిన ఆమ్రపాలి టెక్నాలజీ వాడకంలో ముందంజలో ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యువతకు దగ్గరయ్యారు. చక్కటి పనితీరుతో తెలంగాణ వ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ ప్రజలతో మమేకయ్యే ఈ యువ ఐఏఎస్ తెలుగు రాష్ట్రాల యువతకు రోల్‌ మోడల్‌గా మారారు.

Show Full Article
Print Article
Next Story
More Stories