కేసీఆర్ పర్యటన.. ఆంధ్రా పాలిటిక్స్‌ను ప్రభావితం చేయనున్నారా..?

కేసీఆర్ పర్యటన.. ఆంధ్రా పాలిటిక్స్‌ను ప్రభావితం చేయనున్నారా..?
x
Highlights

విశాఖ కు ఓ అతిధి రాబోతున్నారు ఆధ్యాత్మిక పర్యటన అంటూనే ఆంధ్రా లో అడుగుపెడుతున్నారు ఇంతకి ఎవరు ఆ అతిధి ఏంటా కథ అని అనుకుంటున్నారా! తెలంగాణ ప్రజలు...

విశాఖ కు ఓ అతిధి రాబోతున్నారు ఆధ్యాత్మిక పర్యటన అంటూనే ఆంధ్రా లో అడుగుపెడుతున్నారు ఇంతకి ఎవరు ఆ అతిధి ఏంటా కథ అని అనుకుంటున్నారా! తెలంగాణ ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ కు రాబోతున్న విశిష్ట అతిధి కేసీఆర్ పర్యటన ఏం చెప్పబోతుంది. రాజకీయం గా ఏలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది. ఇదే ఇప్పుడు విశాఖ లో హాట్ టాపిక్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ ఆహ్వానం మేరకు వస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుండి బయలు దేరి మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ శారదాపీఠం చేరుకుంటారు. అక్కడ స్వామిజీ ఆశీర్వచనాలు తీసుకుని రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. పీఠంలోనే భోజనం చేసిన తర్వాత ఒడిశా పర్యటనకు వెళతారు. కేసీఆర్ పర్యటనకు శారదాపీఠంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

కేసీఆర్ ది పూర్తిగా ఆధ్యాత్మికతతో కూడిన పర్యటన అయినప్పటికీ రాజకీయంగా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కేసీఆర్ ఆంధ్రాలో వేలుపెడుతామని చెప్పిన మాట ప్రకారం విశాఖలో తొలి అడుగు వేయబోతున్నారా అనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ నిజంగానే ఆంధ్రా పాలిటిక్స్ ను ప్రభావితం చేయనున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాలు మాత్రం నోరు విప్పడం లేదు. రాజకీయ విమర్శకులు మాత్రం కేసీఆర్ పర్యటనపై పలు కామెంట్స్ చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఆంధ్రాలో అడుగుపెడుతున్న కేసీఆర్ అన్నమాట ప్రకారం పాలిటిక్స్ ను ప్రభావితం చేస్తారా లేక వ్యక్తిగత పర్యటన తో సరిపెడతారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories