నేటి నుంచి కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

నేటి నుంచి కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
x
Highlights

బీజేపీ-కాంగ్రెసేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం నుంచి పర్యటన చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలోని వివిధ...

బీజేపీ-కాంగ్రెసేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం నుంచి పర్యటన చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యి.. వారిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ముందుగా ఇవాళ ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి విశాఖపట్నం బయలుదేరుతారు. ఉదయం 11 గంటల 55 నిమిషాలకు విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా శారదా పీఠానికి చేరుకుని.. స్వరూపానందేంద్ర స్వామితో ప్రత్యేకంగా భేటీ అవుతారు. శారదా పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆశ్రమంలో లంచ్‌ చేసి.. స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న తరువాత భువనేశ్వర్‌ వెళ్తారు కేసీఆర్‌. అక్కడ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశమై ప్రంట్ గురించి చర్చిస్తారు. రేపు ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్, పూరీ ఆలయాలకు వెళ్తారు. అనంతరం అక్కడినుంచి కోల్‌కతా వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమవుతారు. తరువాత అక్కడ కాళీమాతను దర్శించుకుంటారు. రేపు రాత్రి రాత్రి ఢిల్లీకి వెళ్తారు. రేపు లేదా ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories