Top
logo

డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు పెన్షన్

డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు పెన్షన్
X
Highlights

ఎన్నికల ఏడాదిలో సీఎం కేసీఆర్ మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు...

ఎన్నికల ఏడాదిలో సీఎం కేసీఆర్ మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు పెన్షన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు వెయ్యి రూపాయల పెన్షన్ ప్రకటించనున్నారు. 45 ఏళ్లు పైబడిన వారంతా ఈ పథకానికి అర్హులు. దీంతో రాష్ట్ర్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మంది డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు ప్రయోజనం కల్గనుంది. డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వడం ద్వారా ఖజానాపై నెలకు 4 కోట్ల భారం పడనుంది. అయితే 40 ఏళ్లు నిండిన డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు నెలకు 2 వేల పెన్షన్ ఇవ్వాలని ఆయా వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

Next Story