గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం శ్రీకారం!

గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం శ్రీకారం!
x
Highlights

జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.. జిల్లాలోని గట్టు మండలం దగ్గర ఎత్తిపోతల పథకానికి...

జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.. జిల్లాలోని గట్టు మండలం దగ్గర ఎత్తిపోతల పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. 554 కోట్ల రూపాయల అంచనా వ్యవయంతో గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకం పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు.. కరువు పీడిత ప్రాంతమైన గట్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. దీని ద్వారా జిల్లాలోని సుమారు 41 చెరువులను నింపనున్నారు. 33 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. దీనికి ర్యాపంపాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి 4 టీఎంసీల నీటిని ఉపయోగించనున్నారు. కాగా ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌ రావు, లక్ష్మారెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories